HAIR TRANSPLANTATION
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏమిటి?
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక శస్త్రచికిత్స టెక్నిక్, మన తల వెనుక భాగంలో ఉండే జుట్టును లేదా మన శరీరంలో జుట్టును (ఛాతి మీద వెంట్రుకులు లేదా గడ్డంలో ఉన్నవెంట్రుకులు) ఎక్కువుగా ఉన్న ప్రాంతం నుండి వెంట్రుకులను తీసి మనకు ఎక్కడ ఐతే బట్టతల ఉందొ అక్కడ తీసిన వెంట్రుకులను నాటుతారు, దానినే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు.
అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది అందరికి చేయవచ్చా ?
దీనికి
సమాధానం చెప్పాలి అంటే అసలు బట్టతల ఒక్క రకాలు మీకు తెలియాలి.
5 రకాలు బట్టతలు
1) మగవారికి వంశపారంపర బట్టతల (మేల్ పాటర్న్ బల్డన్స్ ) (male pattern baldness).
2) ఆడవారికి వంశపారంపర బట్టతల (ఫిమేల్ పాటర్న్ బల్డన్స్) (female pattern baldness).
3) అలోపేసియా అరేటా (Alopecia areata) (ఇది ఒక ఇన్ఫెక్షన్/బాక్టీరియా కారణముగా వస్తున్నా బట్టతల).
4) టాక్సిక్ అలోపేసియా (Toxic Alopecia) (మందులు కారణముగా,ఇతర వైద్య శస్త్రచికిత్స, శరీరం లో హార్మోన్స్ లోపం వలన వస్తున్నా బట్టతల).
5) మచ్చ అలోపేసియా (Scar Alopecia) (కాలిన ప్రాంతం లో లేదా గాయములు అయినా ప్రాంతం లో జుట్టు పోవటం వలన వస్తున్నా బట్టతల).
అలోపేసియా అరేటా , టాక్సిక్ అలోపేసియా మరియు మచ్చ అలోపేసియాకు ఇంగ్లీష్ మెడిసినల్ ట్రీట్మెంట్ లేదా ఆయుర్వేదం చికిత్సలు ద్వారా రాలిపోయిన జుట్టును చాలా వరుకు తిరిగి రాపించవచ్చు . వీరికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది అంతగా ఉపయోగపడక పోవచ్చు. ఒకసారి వైద్యలను సంప్రదించి సలహా తీసుకోవాలిసిందిగా మా అభ్యర్థన.
ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ టెక్నిక్ ప్రధానంగా వంశపారం పర్యంగా వస్తున్నబట్టతల (మేల్/ఫిమేల్ పాటర్న్ బల్డన్స్) (Male pattern / Female pattern baldness) చికిత్సకు ఉపయోగించబడుతుంది.
వైద్య శాస్త్రములు ప్రకారం వంశపారం పర్యంగా వస్తున్నబట్టతలను 7 విధములుగా విభజించారు.
గ్రేడ్ 1
బల్డన్స్
గ్రేడ్ 2
బల్డన్స్
గ్రేడ్ 3
బల్డన్స్
గ్రేడ్ 4
బల్డన్స్
గ్రేడ్ 5
బల్డన్స్
గ్రేడ్ 6
బల్డన్స్
గ్రేడ్ 7
బల్డన్స్
క్రింద ఫోటో
లో చూపిన విధముగా
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది గ్రేడ్ 1,2,3,4,5 బల్డన్స్ కు బాగుంటుంది. వీరూ ఖచ్చితముగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవచ్చు.
మరి గ్రేడ్ 6 మరియు గ్రేడ్ 7 వాళ్ళకి ఇప్పటికే చాలా వరుకు జుట్టు రాలిపోవడం వలన, వారికీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా కష్టతరం మరియు అత్యంత డబ్బుతో కూడుకొన్న పని.
గ్రేడ్ 6 మరియు గ్రేడ్ 7 వీరికి ఇప్పటికే చాలా వరుకు జుట్టు ఊడిపోవటం వలన, వారి తల వెనుక భాగం లో ఉన్న జుట్టు సమూహం సరిపోకపోవచ్చు బట్టతల మీద నాటడానికి. వీరికి ఛాతి మీద వెంట్రుకులు లేదా గడ్డంలో ఉన్నవెంట్రుకులు కూడా ఉపయోగ పడటానికి అవకాశం ఉంది.
గ్రేడ్ 6 మరియు గ్రేడ్ 7 బల్డన్స్ కు ఒక సిట్టింగ్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పని అవ్వదు. వీరికి 1 లేదా 2,3 సిట్టింగ్ లు పట్టవచ్చు. మొదట సిట్టింగ్ లో తల ముందు భాగం లో వెంట్రుకులు నాటుతారు, రెండో సిట్టింగ్ 6 నెలల తరవాత నాటుతారు అది కూడా మన తల వెనుక భాగం లో వెంట్రుకులు ఇంకా వత్తుగా ఉంటే మాత్రమై, మూడోవ సిట్టింగ్ మరో 6 నెలల తరవాత నాటుతారు అప్పటికి కూడా మన తల వెనుక భాగం లో వెంట్రుకులు ఇంకా వత్తుగా ఉంటే మాత్రమై.
ఒక
మాటలో చెప్పాలి అంటే గ్రేడ్ 6 మరియు గ్రేడ్
7 బల్డన్స్ ఉన్న వాళ్లకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా అంతగా పనిచేయకపోవచ్చు మరియు అత్యంత డబ్బుతో కూడుకొన్న
పని.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ రెండు పద్ధతులు ప్రకారం చేస్తారు.
1) మొదటది FUE టెక్నిక్
2) రెండోది FUT టెక్నిక్
ప్రారంభ సంప్రదింపులో, వైద్యుడు రోగి నెత్తిని విశ్లేషిస్తాడు. మీ ప్రాధాన్యతలను మరియు అంచనాలను చర్చిస్తాడు మరియు ఉత్తమ విధానం సూచిస్తాడు. మరియు సహేతుకంగా ఏ ఫలితాలను ఆశించవచ్చో వారికి సలహా ఇస్తాడు. ప్రీ-ఆపరేటివ్ ఫోలిస్కోపీ జుట్టు యొక్క ప్రస్తుత సాంద్రతను తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
శస్త్రచికిత్సకు ముందు
FUE టెక్నిక్ అంటే ఏమిటి?
- FUE పద్ధతి ఒక ప్రాంతం నుండి 1 లేదా 2,3 వెంట్రుకులు తీయటం జరుగుతుంది. సాధారణంగా తల వెనుక భాగంలో, జుట్టు రాలడం అనేది జరుగదు, కాబట్టి అక్కడ నుంచి వెంట్రుకులు తీసుకొంటారు.
- ముందుగా నిర్ణయించిన మొత్తం వెంట్రుకులను తల వెనుక భాగం నుండి సైకరిస్తాడు, ఆ తరవాత వైద్యుడు జుట్టు రాలిన ప్రాంతాల్లో రోగి నెత్తిపై చిన్న కోతలు చేస్తారు, దానిలో తీసిన వెంట్రుకులను నాటుతారు.
- ఆపరేషన్ తర్వాత 4 నెలలో కొత్త జుట్టు పెరుగుదల సాధారణంగా కనిపిస్తుంది మరియు 18 నెలల వరకు కొనసాగవచ్చు. వెంట్రుకులు తీసిన చోటున చిన్న చిన్న మచ్చలు ఉంటాయి.
- FUE చాలా సహజ ఫలితాలను ఇవ్వగలదు.
FUT టెక్నిక్ అంటే ఏమిటి?
- హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో FUT అనేది పురాతన టెక్నిక్, దీనిలో తల వెనుక భాగంలో హెయిర్ ఫోలికల్స్ ఉన్న చర్మం యొక్క స్ట్రిప్ను డాక్టర్ శస్త్రచికిత్స ద్వారా తొలిగిస్తారు.
- డాక్టర్ సహాయకులు/టెక్నీషియన్లు ఇక్కడి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. వారి పని చర్మం నుండి వెంట్రుకల పుటలను తీయడం మరియు దానిని బట్టతల ప్రాంతంలో తిరిగి పెట్టడం.
- చర్మం యొక్క స్ట్రిప్ శస్త్రచికిత్స ద్వారా తీసివేయబడినందున, ఆ ప్రాంతం మచ్చలకు దారితీస్తుంది. డాక్టర్ యొక్క ప్రమేయం చర్మం యొక్క స్ట్రిప్ను శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి పరిమితం చేయబడింది. మిగిలిన పనిని డాక్టర్ సహాయకులు/సాంకేతిక నిపుణులు చేస్తారు.
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏమి జరుగుతుంది?
- నొప్పి మందులు.
- మీ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటీబయాటిక్స్
- వాపును తగ్గించడానికి రోగ నిరోధక మందులు
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ తర్వాత నివారించాల్సిన 17 విషయాలు.
SIDE EFFECTS
మంచి నేర్పరి
అయిన వైద్యుడును ఎంచుకోవాలి, దాని కోసం సమగ్ర పరిశోధన చేయాలి. మంచి వైద్యుడు మీకు
అన్ని క్లియర్ గా చెపుతాడు, ఇక మీకు మీరు అలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఈ ఆర్టికల్ మీకు
కావలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని నేను ఆశిస్తున్నాను.
FAQ'S
నోట్
(Note) :1 మన శరీరంలో జుట్టు లేదా మన తల వెనుక
భాగం లో ఉన్న జుట్టును మాత్రమై ఉపయోగిస్తారు. ఇంకొకరి శరీరం యొక్క వెంట్రుకులును మనకు నాటకూడదు / నాటరుకూడా ఎందుకంటే వారి శరీరం యొక్క
జీన్స్ మరియు మన శరీరము జీన్స్ వేరు వేరుగా ఉంటాయి కాబట్టి.
2) హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత సహజంగా జుట్టు మొలకెత్తడం ప్రారంభిస్తాయి మరియు జీవితాంతం అలానే కొనసాగుతాయి.
1 Comments
Nice
ReplyDelete