జుట్టు రాలడానికి శాస్త్రీయ కారణం ఏమిటి?
Hair fall reasons as per scientific studies.
మాములుగా తలపై పెరిగే వెంట్రుకులు మనకి ఒక వయస్సు వచ్చిన తర్వాత క్రమ క్రమంగా ఊడిపోయి బట్టతలకి రావటానికి కారణం అవుతుంది. మగవాళ్ళు కి (Testosterone) టెస్టోస్టిరాన్లో మార్పుల వల్ల తలపై కొన్ని భాగాల్లో జట్టు ఊడిపోతుందని, హార్మోన్లో ఈ మార్పును (Di hydro testosterone) (DHT) డిహైడ్రోటెస్టోస్టిరాన్ (డీహెచ్టీ) అంటారు. (DHT) డీహెచ్టీ వల్ల తలపై ఉండే చర్మంలో కొవ్వు మోతాదు తగ్గగడం వల్ల ఒత్తిడిని తట్టుకోలేక జట్టు ఊడిపోతుందన్నది పరిశోధనలో గుర్తించారు. అయితే మన వయసు పెరిగే కొద్దీ చర్మం మరియు దాని క్రింద కొవ్వు తగ్గిపోవడంతో వెండ్రుకలు ఊడిపోతాయి. మహిళలు విషయంలో మాత్రం ఇలా వెండ్రుకలు ఊడిపోకుండా (Estrogen) ఈస్ట్రోజన్ హార్మోన్ నివారిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
జుట్టు రాలుతున్నట్టు మనం మొదట్లో గాని గమనిస్తే మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకొని అదుపు చేయొచ్చు. ముఖ్యంగా పోషక పదార్థాలు ఎక్కువగా వుండే ఆహారాలను తీసుకుంటే. జట్టు రాలే సమస్యను చాలా వరుకు అరికట్టవచ్చు.
జుట్టు రాలుటను నిరోదించే కొన్ని పోషక ఆహార పదార్థాలు: what to eat to stop hair fall immediately.
- గుడ్లు
- పాలు
- వోట్స్
- కొవ్వు చేప
- బచ్చలికూర
- చిలగడదుంపలు
- సోయా
- పాలకూర
- అవకాడో
- బ్లూ బెర్రీలు
- వాల్నట్
జుట్టు రాలడానికి మరి కొన్ని కారణాలు : Hair fall reasons.
- హార్మోన్ అసమతౌల్యం
- కఠినమైన కేశాలంకరణ
- అనారోగ్యం
- అధిక ఒత్తిడి
- శస్త్రచికిత్స
- పోషకాహార లోపాలు
- మందులు మరియు విటమిన్లు లోపం
- స్కాల్ప్ ఇన్ఫెక్షన్ (చుండ్రు)
- ఆడవాళ్ళు ప్రసవం తరువాత హార్మోన్ల అసమతుల్యత.
- వృద్ధాప్యం.
కొన్ని రకాల బట్టతలలు : Types of bald heads
- మగవారికి వంశపారంపర బట్టతల (మేల్ పాటర్న్ బల్డన్స్ ) (male pattern baldness)
- ఆడవారికి వంశపారంపర బట్టతల (ఫిమేల్ పాటర్న్ బల్డన్స్) (female pattern baldness)
- అలోపేసియా అరేటా (Alopecia areata)
- టాక్సిక్ అలోపేసియా (Toxic alopecia)
- మచ్చ అలోపేసియా (Scar alopecia)
చికిత్స ప్రక్రియలు. Hair loss treatment in India
బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక. అందుబాటులో ఉన్నావైద్య చికిత్సలు.
మొదట మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది కానీ వాటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వైద్యుల సూచన మేరకు తీసుకోండి
వాటితో ప్రయోజనం లేకపోతే మీసోథెరపీ (Mesotherapy), స్టెమ్సెల్ థెరపీ (Stem cell therapy), ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా Platelet-Rich Plasma (PRP) అండ్ డర్మారోలర్ (Dermaroller) వంటి ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు.
ఇక వాటితో ప్రయోజనం లేకపోతే లేజర్ సహాయంతో చేసే ఇన్ఫ్రారెడ్ లైట్ థెరపీ (infra red light therapy), లేజర్ కోంబింగ్ (laser combing) కూడా బాగా ఉపయోగపడతాయి.
చివరిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ (Hair transplantation) వంటి చికిత్సలు కూడా ఉన్నాయి.
ముందుజాగ్రత్తలు : Precautions : Home remedies for hair fall and regrowth
ఒత్తిడి, ఆందోళనను వదిలెలియాలి.
మంచిగా టైం కి నిద్రపోవాలి
మంచి ఫుడ్ తీసుకోవాలి. (పాలు, గుడ్లు,చేపలు, మొలకలు, ఎండుద్రాక్ష, తాజా కూరగాయలు, చిక్కుళ్ళు, సోయా,నువ్వులు, పండ్లు,బీన్స్ ఆకు కూరగాయలు). ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి)
ధ్యానం, యోగా సాధన చేయండి.
ఉదయం సూర్యరశ్మి లో ఉండండి.
ఎక్కువ నీరు త్రాగలి.
జంక్ ఫుడ్ నుండి దూరంగా ఉండండి.
ఉత్పత్తు రసాయనాలు మీ జుట్టు కు వాడడము వలన కూడా కుదుళ్లను దెబ్బతీస్తు ఉన్నాయి.
ముగింపు : Conclusion
మీ హృదయాన్ని బలంగా ఉంచండి, దానితో పోరాడండి. కొన్నిసార్లు పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు కాని మనం దానిని ఎదుర్కోవలసి ఉంటుంది. జీవితం అన్ని సమయాలలో ఒకేలా ఉండదు. సమాజం లో మీరు ఎంత బలంగా ఉన్నారో జీవితం పరీక్షిస్తుంది.
FAQ’s
ఒక రోజులో ఎంత జుట్టు రాలడం సాధారణం?
రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవడం సహజం. ప్రతిరోజూ అంతకంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతున్నప్పుడు, ఒకసారి డాక్టర్ ను కలిసి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోండి.
నేను ఎంత తరచుగా నా జుట్టు కడగాలి?
ప్రతి 3 రోజులు, కడగడం సాధారణంగా మంచిది. జుట్టు బాగా జిడ్డుగా ఉంటే, నెత్తిమీద దురద లేదా ధూళి కారణంగా మెరిసిపోతుంటే, వెంటనే తల స్నానం చేసి శుభ్రం చేసుకోండి.
రోజూ జుట్టును తడి చేయడం వల్ల అది దెబ్బతింటుందా?
తడి జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది మరియు పొడి జుట్టు కంటే విరిగిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి తల స్నానం చేసిన వెంటనే దువ్వెనతో దువ్వటం మరియు లాగడం అనేది మీరు చేసై చెత్త పనులలో ఒకటి.
ఒక వ్యక్తి తన జుట్టును ఎలా జాగ్రత్తగా చూసుకోవచ్చు?
1) రసాయన ఆధారిత షాంపూలను నివారించండి
2) సరైన ఆహారాలు తినండి
3) మల్టీ-విటమిన్ హెయిర్ సప్లిమెంట్స్
4) ఎక్కువ నీరు త్రాగలి
5) మీ శిరోజాలను ఉత్తేజపరిచేందుకు 15 - 20 నిమిషాల పాటు మసాజ్ చేయడం ద్వారా మీ నెత్తి మీద రక్తం (బ్లడ్) సర్క్యూలేషన్ బాగుంటుంది.
0 Comments