Reasons for dandruff : తలలో చుండ్రు పోవాలంటే ఏం చేయాలి.

చుండ్రుకి కారణములు : Reasons for causing of Dandruff as per studies.

చుండ్రు (Dandruff) ఒకరకమైన చర్మవ్యాధి. తలదువ్వుకోగానే దువ్వెనలో తెల్లటి పొలుసులు రాలుతాయి. చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే 2 పొరలు ఉంటాయి. పైన ఏమో ఎపిడెర్మిస్, క్రింద ఏమో  డెర్మిస్ అనే పొరలుంటే, అందులో డెర్మిస్ లో నుంచి హెయిర్ ఫాలికిల్స్ అనే రోమాంకురాల్లోంచి వెంట్రుకలు పుట్టుకువస్తాయి. వాటి  పక్కనే సెబేషియస్ గ్లాండ్స్  ఉంటాయి.ఈ గ్రంథులు  సీబమ్ అనే నూనె పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ సీబమ్ ఉత్పత్తి కొందరిలో  సాధారణంగా ఉంటే, మరికొందరి లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తలపైన ఉండే చర్మం జిడ్డుగా తయారుఅవుతాది. జిడ్డుపై మెలస్సీజియా ఫంగస్ అధికంగా పెరిగి చర్మకణాలపై దాడి చేసి, కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.ఈ రసాయనాలతో చర్మం పైన మృతకణాలు పెరుగుతాయి. దాంతో తలలో పొట్టులా రాలే పొలుసులూ మరియు వాటి కారణంగా దురద, చికాకు పెరుగుతాయి. మనం  తలను దువుకొనుటపుడు  అక్కడ పేరుకున్న మృతకణాలు రాలిపడటం జరుగుతుంది. ఇలా రాలిపడే మృతకణాలనే మనం చుండ్రు అంటాం. ఒక్కోసారి ఈ చుండ్రు తలమాడుపైనేగాక కనుబొమలు, కనురెప్పలు, ఫై  కూడా  కనిపించవచ్చు.

చుండ్రు తీవ్రంగా ఉండే కండిషన్ను సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. చుండ్రు వచ్చేందుకు పోషకాహార లోపం, రోగనిరోధక శక్తి తగ్గడం, మలబద్దకం, వైరస్లతో వ్యాపించే అంటువ్యాధుల ఇన్ఫెక్షన్ తర్వాత, సెబోరిక్ ఎగ్జిమా, మానసిక ఒత్తిడులు, తీవ్రమైన అలసట, వ్యక్తిగత శుభ్రత లోపించడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, హెయిర్ స్టైల్స్ కోసం వాడే స్ప్రేలు ఇలా రకరకాల కారణాలు.

చుండ్రు చిట్కాలు మరియు ఇంటి నివారణలు : Dandruff tips and home remedies

ఇతరుల దువ్వెనలను, బ్రెష్లను, టవల్స్ వాడకూడదు. తమ వస్తువులను ఇంకొకరికి  ఇవ్వకూడదు.

శరీరం లో  నీటిపాళ్లు తగ్గకుండా ఉండేందుకు చల్లటి సీజన్లో మనమే పనిగట్టుకుని కనీసం రోజూ 12 గ్లాసుల నీళ్లు తాగాలి.  

ప్రతి వారం ఒకసారి శుద్ధమైన కొబ్బరినూనెను కానీ, ఆలివ్ నూనెను కానీ గోరువెచ్చగా  చేసి, తలకు పట్టించి, నిధానంగా  మర్దన చేయాలి. ఆ తరవాత కుంకుడుకాయలు, శీకాయపొడితో తలస్నానం చేస్తే  జుట్టు లో ఉన్న మట్టి మరియు ఇతర ఫంగస్లు చాల వరుకు శుభ్రమవుతాయి.

గోరువెచ్చని నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించాలి.

ఇతరుల దుప్పట్లను, తలగడలను వాడకూడదు.

విపరీతమైన  ఎండ కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.

చుండ్రు ఎక్కువుగా ఉంటే మీ  తలగడలను  మరియు తలగడ కవర్స్ ను వేడినీటిలో నానబెట్టి ప్రతి రౌండు 2-3 రోజులకి శుభ్రంగా ఉతికి ఎండలో ఆర వేయాలి.

తలస్నానంకు  కుంకుడు కాయల రసం లేదా  సీకాయ పొడినే వాడటం మంచిది.

పోషకాహార లోపం లేకుండా మంచి  ఆహారాన్ని తీసుకోవాలి.

మంచిగా టైం కి నిద్రపోవాలి.

మీ దువ్వెనలో పళ్ళ మధ్య ఉండే మట్టిని ఎప్పటికిఆప్పుడు  శుభ్రపరుస్తూ ఉండాలి. దువ్వెనలను వారానికి ఒకరోజు బాగా వేడి ఉన్న నీటితో శుభ్రపరచడం మంచిది

వేసవి కాలంలో ఎక్కువుగా  చెమట పట్టటం వలన మరియు  వానాకాలంలో తల తడవడం వల్ల వెండ్రుకలు అపరిశుభ్రమవుతాయి.

వేపాకులను ముద్దగా నూరి దానిని  తలమాడుపై పట్టించి, ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకల లో ఉండే చుండ్రు తొలగిపోయి తలమాడు శుభ్రంగా తయారుఅవుతది. 

పుదీనా ను  గ్రైండర్ లేదా మిక్సీ లో వేసి ముద్దగా  రసం తీసి తల ఫై మాడుకి పట్టించి పావుగంటయిన లేదా అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య చాల వరకు తగ్గుతుంది..

మందార ఆకుల తల జుట్టుకు కండిషనర్ గా పనిచేస్తాయి. మందార ఆకులు, పువ్వులు పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.

వస కొమ్మును పొడిగా చేసి దానిని కొంచెం నీటిలో కలిపి తల ఫై  జుత్తు కుదుళ్ళకు పట్టించు కోవటం వలన మంచి ఫలితాలు వస్తాయి.

పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడిని కలిపి తల ఫై మాడుకి పట్టించి ఒక  గంట తర్వాత స్నానం చేస్తే చాల మంచి ఫలితాలు వస్తాయి.

రెండు టేబుల్ స్పూన్ల మెంతులును  నీటి లో వేసి 10 గంటలు నానపెట్టి,ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఆదే విధంగా  గసగసాలు కూడా 5 or 6  గంటలు నానపెట్టి,ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేసిన మంచి ఫలితాలు వస్తాయి.

అలోవెరా జెల్/ కలబంద జెల్ కూడా బాగా పనిచేస్తది.

చుండ్రు మృత చర్మం వలన తయరవుతుంది. అందుకని గుండు చెయంచుకునెప్పుడు ఆ మృత చర్మంను తోలగించమని అడగాలి. ఆ తరువాత ప్రతి రోజు శుద్ధమైన కొబ్బరినూనెను కానీ, ఆలివ్ నూనెను రాసుకుంటె మృత చర్మం తయారుఅవదు, చుండ్రు ఉండదు.

ముగింపు : Conclusion

చుండ్రు తీవ్రత రోజు రోజు కి పెరుగుతున్నా  , తల పై మాడు చర్మం ఎర్రగా మారినా మరియు జుట్టు  పెచ్చులు పెచ్చులుగా ఎక్కువగా ఊడుతున్నా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

                                                              FAQ’S

సీజన్లో ఎక్కువ చుండ్రు ఉంటుంది?

శీతాకాలంలో చర్మం చల్లగా ఉంటుంది.  చుండ్రు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు అంటున్నారు.

చుండ్రు వల్ల జుట్టు రాలుతుంది?

ఫంగస్ వల్లన  చుండ్రు ఎక్కువయితే,  కొద్ది కొద్దిగా జుట్టు రాలవచ్చు.

బాగా వేడి నీరు చుండ్రుకు కారణమవుతుందా?

బాగా వేడి నీరు మీకు చుండ్రుని ఇస్తుంది. చుండ్రు మరియు దురద వెనుక ప్రధాన కారణాలలో ఒకటి పొడి చర్మం. వేడి నీరు మీ తలను అత్యంత పొడిబారేలా చేస్తుంది, ఇది దురద మరియు చుండ్రు సమస్యలకు కూడా దారితీస్తుంది.

షాంపూతో జుట్టును ఎలా కడగాలి?

మీరు మీ జుట్టు మరియు తలకు షాంపూని వర్తించే ముందు, దానిని కొద్దిగా నీటిలో కరిగించండి. ఇది షాంపూలోని రసాయనాల అధిక సాంద్రతను తగ్గిస్తుంది. ఇది మురికిని శుభ్రపరుస్తుంది మరియు మీ నెత్తి నుండి మృత కణాలను తొలగిస్తుంది. కానీ కుంకుడుకాయలు, శీకాయపొడితో గాని  తలస్నానం చేస్తే మంచిది.

Post a Comment

0 Comments