PRP for hair loss. PRP చికిత్స విధానం బట్టతలకి (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా)

PLATELET RICH PLASMA TREATMENT FOR HAIR LOSS

PRP (P=ప్లేట్లెట్ R=రిచ్ P=ప్లాస్మా) (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా) 

PRP అంటే  ఏమిటో తెలుసుకొనే ముందు కొన్ని విషములు  తెలియలి.

అస్సలు PRP చికిత్స ఎవరికీ చేస్తారు అనేది మీకు తెలియలి.

  • హెయిర్ ఫాల్/బట్టతల ప్రారంభ (లేదా) మధ్య దశలో ఉన్నపుడు ఈ చికిత్స చేస్తారు. 
  •  ముఖం మీద చర్మము ముడతలను (లేదా) వయస్సు తగ్గిoచటానికి కూడా ఈ చికిత్స ఉపయోగిస్తారు.
  • మనకు తగిలిన గాయములను (Wound) తొందరగా తగ్గిoచటానికి కూడా ఈ చికిత్స ఉపయోగిస్తారు.

పిఆర్పి (PRP) ఇంజెక్షన్లు సహజముగా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి మరియు వెంట్రుకల కుదుళ్లకు రక్త సరఫరాను పెంచడం, వెంట్రుకకు బలం మరియు  మందం పెంచడం అనేది ఈ చికిత్స ద్వారా జరుగుతుంది.

మీరు పిఆర్పి (PRP) థెరపీని పొందాలని ఆలోచిస్తుంటే, మీరు ఏదైనా ప్రత్యేకమైన మందులు వాడుతున్న లేదా రక్తం తక్కువగా ఉన్న మొదలైన వాటి గురించి మీ వైద్యుడికి చెప్పండి. ఈ ప్రక్రియ చేయడానికి ముందు, వైద్యుడు మీ  ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడగవచ్చు.

పిఆర్పి (PRP) థెరపీ చేసే ముందు వైద్యుడు డెర్మా రోలర్ అనే వస్తువును మీ తల పై  రోల చేస్తారు మరియు కొంచం మత్తుమందు కూడా ఇస్తారు నొప్పి తెలియకుండా ఉండడానికి.

PRP చికిత్స ప్రక్రియ : PRP TREATMENT

పిఆర్పి (PRP) చికిత్స అనేది మూడు పద్ధతులుగా ఈ ప్రక్రియ చేస్తారు. పిఆర్పి చికిత్స నెలకు 2   సార్లు హాస్పిటల్ కు వెళ్లి చేయించుకోవాలిసిన అవసరం ఉంటుంది.

మొదటిగా

మీ చేయి (Hand) భాగం నుండి కొంత రక్తం తీసుకొంటారు.

రొండోది

తీసుకొన్నరక్తం ను ఒక  మిషను లో ఉంచి గిరగిరా తిప్పుతారు కరెంటు ద్వారా.  ఇలా తిప్పుడాం వలన రక్తం లో  సాంద్రత కలిగిన ద్రవాలు పైకి తేలుతాయి వాటినే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు.

ఎర్ర రక్త కణాలు క్రిందకు  చేరి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది పైకి తేలుతుంది. చూడడానికి పసుపు రంగులో ఉంటుంది.

ఈ ప్రక్రియ 15 - 20 నిమిషాల వరకు పట్టవచ్చు.

మూడొవది

ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మాను ఒక సిరంజిలోకి తీసుకొని, ఆపై జుట్టు ఊడిన ప్రాంతంలో (లేదా) బట్టతల ప్రాంతంలో ఇంజెక్షన్లు ద్వారా మన తల మాడు పై కొంచం కొంచం గా  ఇంజెక్ట్ చేస్తారు.

అంతే PRP చికిత్స.

PRP చికిత్స తర్వాత నేను ఏమి చేయకూడదు?

1) పిఆర్పి (PRP) చికిత్స తర్వాత మొదటి 72 గంటలు పాటు ఇంజెక్షన్ సైట్‌లో ఐస్ (ICE) లేదా ఎండా తగలకుండా  చూసుకోండి .

2) మొదటి కొన్ని రోజులు వేడి నీళ్లు స్నానం చేయవద్దు మరియు ఆవిరి వంటివి చేయవద్దు.

3) మొదటి వారంలో మందు పానీయాలు (బ్రాందీ , విస్కీ) మరియు సిగరెట్టే వంటివి  చేయకూడదు.

4) పిఆర్పి (PRP) చికిత్స తర్వాత మొదటి 24 గంటలు తల స్నానం చేయడం మానుకోండి.

పిఆర్పి (PRP) థెరపీ వలన కొన్ని దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) (Side Effects)

పిఆర్పి (PRP) థెరపీలో, రోగి యొక్క సొంత రక్తం వారి నెత్తికి ఇంజెక్ట్ చేయబడుతుంది, కాబట్టి అంటు వ్యాధి వచ్చే ప్రమాదం ఉండదు. ఏదేమైనా, చికిత్సలో పాల్గొన్న ఇంజెక్షన్లు కొంత హాని కలిగించే ప్రమాదం ఉంది.

ఉదాహరణకు

రక్త నాళాలు లేదా నరాలకు గాయం.

ఇన్ఫెక్షన్ (infection) వచ్చే అవకాశం.

PRP థెరపీలో ఉపయోగించే మత్తుమందుకి మీకు ప్రతికూల ప్రతిచర్యను పొందే అవకాశం కూడా ఉంది. మత్తుమందు పట్ల మీ అసహనం గురించి మీ వైద్యుడికి ముందుగానే తెలియజేయండి.

నోట్ (Notes) :  

1)    మీకు ఇతరేతర అనారోగ్య  సమస్యలు ఉంటే ఈ చికిత్స.తీసుకొనటానికి కొంచం ఆలోచించండి లేదా మంచి వైద్యుడు సలహా తీసుకోండి.

2)    పిఆర్‌పి (PRP) చికిత్స నెలకు 2 సార్లు హాస్పిటల్ కు వెళ్లి చేయించుకోవాలిసిన అవసరం ఉంటుంది.

3)    6 నెలలు పాటు ఈ చికిత్స తీసుకోవాలిసి ఉంటుంది, ఆ తరవాత కూడా ఈ చికిత్స తీసుకోవాలిసిన అవసరం ఉంటుంది వైద్యుడు సలహా మేరకు.

4)    డబ్బులు కొంచెం ఎక్కువగా ఖర్చు అవ్వచ్చు. మంచి వైద్యుడు మీకు అన్ని క్లియర్ గా వివరిస్తాడు. ఒకసారి ఈ చికిత్స తీసుకోవాలి అని నిర్ణయించుకొంటే  మంచి వైద్యుడుని  సంప్రదించాలి.

Conclusion ముగింపు

పిఆర్పి (PRP) చికిత్స జుట్టు రాలడం (లేదా) బట్టతలను సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది అని నిరూపించడానికి తగినంత పరిశోధన జరగలేదు. పిఆర్పి (PRP) బట్టతలను తగ్గిస్తుంది అని చాల తక్కువ  క్లినికల్  ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ చికిత్స పనిచేస్తుంది అని చాలా మంది నమ్ముతున్నారు. చికిత్స సలహా ఇవ్వలేము. ఒకసారి మంచి వైద్యుడును సంప్రదించి మీరు  సలహా తీసుకోవలసిందిగా మా అభ్యర్ధన.

మీకు PRP థెరపీ పై సమాచారం వచ్చిందని మరియు మీ ప్రశ్నకు మీకు సరైన సమాధానం లభించిందని మేము ఆశిస్తున్నాము.

PRP థెరపీ మరియు చికిత్స గురించి మరింత సమాచారం కోసం, మీరు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించవచ్చు.

FAQ'S

 PRP నొప్పిగా ఉంటుంది?

చికిత్స చేసే సమయంలో కొంచెం  నొప్పిగా ఉంటుంది. అందుకే మీకు మత్తుమందు ఇస్తారు.

PRP చికిత్స వెంటనే పని చేయగలదా?

2-3  నెలలు లో మీ జుట్టు కొంచెం బలంగా మరియు కొంచెం మందంగా పెరుగుతుంది. కానీ చికిత్స ఆపివేయిస్తే మళ్ల మాములుగా అయిపోయి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి మంచి వైద్యుడును సంప్రదించి మీరు  సలహా తీసుకోవలసిందిగా మా అభ్యర్ధన.




Post a Comment

2 Comments