Male pattern baldness మగవారికి వంశపారంపర బట్టతల (మేల్ పాటర్న్ బల్డన్స్ )

MALE PATTERN BALDNESS

మగవారికి వంశపారంపర బట్టతల

బట్టతల లేదా వేగంగా జుట్టు రాలడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత యొక్క ప్రధాన సమస్య.
బట్టతల అనేది 50 ఏళ్లు పైబడిన వారికీ కాకుండా 25-30 సంవత్సరాల వయస్సు గల యువకులకు కూడా వస్తుంది.

2019 సంవత్సరం పరిశోధన ప్రకారం, భారతదేశంలో 18-34 సంవత్సరాల వయస్సు గల 47.6% మంది పురుషులు బట్టతల బాధితులు. 35-50 సంవత్సరాల వయస్సు గల పురుషులలో 52.6% మంది బట్టతలతో బాధపడుతున్నారు. పురుషులలో బట్టతల సమస్యను మగవారి వంశపారంపర బట్టతల (Male pattern baldness)  అంటారు.

చిన్న వయసులో బట్టతల కారణంగా, పురుషులు సామాజిక మరియు వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. బట్టతల కారణంగా, వీరు వారి  వయస్సు కంటే చాలా పెద్దవారిగా కనిపిస్తున్నారు. ఇది కాకుండా, కొన్నిసార్లు బట్టతల కారణంగా పెళ్లి ( వివాహం), లవర్స్ (ప్రేమ-సంబంధం) లేదా డేటింగ్ వంటి సమస్య ఉంటుంది.

పురుషులలో జుట్టు రాలడం అనేది అత్యంత సాధారణ సమస్య ఇది. కానీ క్రమంగా, ఆ భాగంలో కొత్త జుట్టు పెరగడం అనేది ఆగిపోతుంది మరియు  బట్టతలకు కారణం అవుతుంది.

మగవారికి వంశపారంపర బట్టతల రావటానికి కారణమేమిటి?Reasons for Male pattern baldness?

పురుషుల బట్టతలకి అతి పెద్ద కారణం జెనెటిక్స్ (జన్యు పరం పర), అంటే మీ కుటుంబంలో ఎవరికైనా బట్టతల సమస్య ఉంటే అది జన్యులు కారణముగా మీకు రావచ్చు.

సైన్స్ పరిశోధన శాస్త్రం ప్రకారంమగవారి వంశపారంపర బట్టతల అనేది నేరుగా పురుష సెక్స్ హార్మోన్ ఆండ్రోజెన్లకు సంబంధించినది.

మన శరీరం లో ఉండే ఆండ్రోజెన్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం జరుగుతుంది. తలపై ఉన్న ప్రతి వెంట్రుకకు దాని స్వంత వృద్ధి చక్రం ఉంటుంది (అంటే కొంత  కాలం తరవాత ప్రతి  వెంట్రుక రాలిపోవడం మరియు దాని స్థానం లో కొత్త వెంట్రుక పుట్టడం  అనేది జరుగుతుంది). ఈ వృద్ధి చక్రం బలహీనపడటం వలన మన జుట్టు మూలాలు బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది.

ఒకసారి బలహీనపడటం ప్రారంభం అయిన తరవాత మన జుట్టు అనేది సన్నగా మరియు చిన్నగా తలపై పెరగడం ప్రారంభమవుతుంది. (ఒక మాటలో చెప్పాలి అంటే జుట్టు వత్తు అనేది క్రమక్రముగా తగ్గిపోవటం లేదా పలచబడటం). క్రమంగా జుట్టు పెరుగుదల చక్రం ముగుస్తుంది మరియు వాటి స్థానంలో కొత్త జుట్టు పెరగడం అనేది ఆగిపోతుంది.

వారసత్వంగా వచ్చిన పురుషుడి బట్టతలకు సాధారణంగా ఎలాంటి దుష్ప్రభావాలను కలిగి ఉండదు.

కానీ కొన్నిసార్లు బట్టతలకి కొన్ని తీవ్రమైన కారణాలు ఉండవచ్చు.

  • క్యాన్సర్ కలిగి (కొన్ని మందులు తీసుకోవడం వలన)
  • థైరాయిడ్ సమస్యలు ఉన్నా.
  • స్టెరాయిడ్స్ తీసుకోవడం వలన.
  • మరియు ఇతర ఇతర శరీర లోపముల వలన కూడా ఆవచ్చు.
  • ఏదైనా కొత్త మందులు  తీసుకున్న తర్వాత జుట్టు రాలడం సమస్య మొదలైతే లేదా ఏదైనా ఇతర ఆరోగ్య సమస్య తర్వాత అది మొదలైతే, అటువంటప్పుడు తప్పనిసరిగా  వైద్యుడిని సంప్రదించాలి.

అటువంటి సమస్యల విషయంలో, డాక్టర్ మీకు బయాప్సీ లేదా రక్త పరీక్ష చేయించుకోవాలని సలహా ఇస్తారు. పరీక్షలతో, మీరు రుగ్మత కారణంగా జుట్టు రాలడానికి గురవుతున్నారో డాక్టర్ తెలుసుకోవచ్చు.

జుట్టు రాలడం సమస్య ఎవరికి ఉంటుంది? Who will have hair loss problem?

మగవారికి వంశపారంపర బట్టతల సమస్య అనేది టీనేజ్ లో లేదా యుక్తవయస్సులో  ప్రారంభమవుతుంది. ఇది వయస్సుతో పెరుగుతుంది. జన్యుపరమైన అంశాలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తాయి.

మీ తల్లి వైపు బంధువులలో పురుషులలో  బట్టతల చరిత్ర ఉంటే అది మీకు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మగవారికి వంశపారంపర బట్టతల సంకేతాలు.Indications for male pattern baldness. 

మీ తల నుదురు భాగంలో మరియు తల మధ్య భాగం లో  వెంట్రుకలు రాలిపోతుంటే, మీకు బట్టతల సమస్య వచ్చే అవకాశం ఉంది.

జుట్టు మొత్తం పలచ పడటం మొదలవుతుంది మరియు క్రమంగా జుట్టు మొత్తం ఊడిపోవడం జరుగుతుంది.

బట్టతలను దాచడానికి సులువైన మార్గాలు. How to cover bald areas.

  • .   హెయిర్ స్టైల్ (Hair style) : కొద్ది మొత్తంలో జుట్టు రాలిపోయిన పురుషులు సరైన రీతిలో తల దువుకోవడం వలన మీ జుట్టు  రాలిన ప్రాంతం దాచుకోవడానికి అవకాశం ఉంటుంది.

  • .   విగ్ లేదా హెయిర్పీస్ (Wigs / Hair piece) : ఈ ఆధునికి కాలంలో మంచి మోడల్ విగ్స్ మీకు మార్కెట్ లో లాబీయిస్తాయి. ఒకసారి మీరు ట్రై  చేస్తే మీరు హ్యాపీ గా ఫీల్ అవుతారు.

  • కాస్మెటిక్స్ (Cosmetics)  :- హెయిర్  బిల్డింగ్  ఫైబర్స్ (Hair Building fibers) ఉదాహరణకు కొన్ని కంపెనీ పేరులు :  Toppik, caboki, Beardo etc., ఇచ్చిన పేర్లను  ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి మీకు అర్ధమౌది.

చికిత్స ప్రక్రియలు. Hair loss treatments

బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక. అందుబాటులో ఉన్నా వైద్య చికిత్సలు.

మొదటిది 

  •       మినాక్సిడిల్ (Minoxidil)
  •       ఫెనస్టెరైడ్ (Finasteride)
  •      డ్యూటస్టెరైడ్ (Dutasteride)

వంటి మందులు వాడాల్సి ఉంటుంది కానీ వాటి వలన త్రివమైన  సైడ్ ఎఫెక్ట్స్  ఉంటాయి. వైద్యుల సూచన మేరకు తీసుకోండి.

రొండోది 
  • మీసోథెరపీ (Mesotherapy)
  • స్టెమ్సెల్ థెరపీ (Stem cell therapy)
  • ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా Platelet-Rich Plasma (PRP)
  • డర్మారోలర్ (Dermaroller)

 వంటి ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు.

మూడొవది

  • లేజర్ సహాయంతో చేసే ఇన్ఫ్రారెడ్ లైట్ థెరపీ (infra red light therapy)
  • లేజర్ కోంబింగ్ (laser combing)
చివరిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ (Hair transplantation) వంటి చికిత్సలు కూడా ఉన్నాయి.  హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.Click here.

ముగింపు  (Conclusion)

మగవారికి లేదా ఆడవారికి  బట్టతల రావటానికి చాల కారణములు ఉంటాయి. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి బట్టతలఎందుకు వస్తుందో తెలుసుకోండి. Click here

FAQ'S

వంశపారంపర  బట్టతల సహజంగా ఆగిపోతుందా?

వంశపారంపర  బట్టతల నివారించడానికి సరిఅయిన మార్గం లేదు. ఒక సిద్ధాంతం ప్రకారం ఒత్తిడి కారణముగా శరీరంలో సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి స్థాయిలు పెరగటం ద్వారా జుట్టు రాలుతుంది అని అంటున్నారు. మీరు మంచిగా నడవడం,  ప్రశాంతమైన సంగీతం వినడం మరియు ప్రశాంతముగా  సమయాన్ని ఆస్వాదించడం మరియు విశ్రాంతి కార్యక్రమాలలో పాల్గొనడం వలన ఒత్తిడిని తగ్గించవచ్చు. 

పూర్తి బట్టతల రావటానికి ఎంతకాలం పడుతుంది ?

పూర్తి బట్టతల రావడానికి సాధారణంగా 15 నుండి 25 సంవత్సరాలు పడుతుంది, కానీ ఇంకా తొందరగా కూడా ఊడిపోయి అవకాశం ఎక్కువుగా  ఉంది. మొదట్లో జుట్టు సన్నబడటం ప్రారంభమవుతుంది.  అదే సమయంలో సాధారణంగా తల పైభాగంలో జుట్టు సన్నగా మారుతుంది మరియు నెత్తి మధ్యలో బట్టతల పాచ్ క్రమంగా అభివృద్ధి చెందుతుంది.

Post a Comment

1 Comments