TOP 15 Skincare beauty tips
మీ కోసం 15 ఉత్తమ చర్మ సంరక్షణ చిట్కాలు :
ప్రతి మనిషికి మంచి చర్మం ఎప్పుడూ ఉంటుంది. మనం మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము కానీ శ్రద్ధ వహించం. మంచి చర్మాన్ని కలిగి ఉండటం ఎందుకు అవసరం అని మీరు అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడం సులభం అవుతుంది. మంచిగా చర్మాన్ని కాపాడుకోవటానికి మనం ఆరోగ్యకరమైన జీవనశైలి మొదలుపెట్టవలిసి ఉంటుంది.అప్పుడు సహజ వృద్ధాప్యాన్ని త్వరగా రాకుండా కాపాడుకోవచ్చు మరియు ఎటువంటివి ఐన చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ చర్మాన్ని కాపాడుకునే 15 చిట్కాలను అనుసరించవలిసి ఉంటుంది.
1.సూర్యుడి
ప్రభావం నుండి మీ చర్మాన్ని రక్షించుకోండి:
మీ చర్మాన్నికాపాడుకోవటానికి మొదటి మార్గం సుర్యుడు నుంచి ప్రసరించే సూర్యరశ్మి నుండి కాపాడుకోవలిసిన అవసరం ఉంటుంది. సూర్యరశ్మి నేరుగా మనిషి చర్మం పై పడటం వలన ముడతలు, వయసు, మచ్చలు మరియు వివిధ చర్మ సమస్యలకు గురి కావలిసి వస్తుంది. బయట మార్కెట్లో వివిధ రకములైన సన్స్క్రీన్ లోషన్స్ మనకు దొరుకుతాయి. మనం బయటకు వెళ్లే ముందు ఈ సన్స్క్రీన్ లోషన్స్ మన శరీరానికి రాసుకుని వెళ్లడం వల్ల మనం హానికరమైన సూర్యరశ్మి కిరణాలూ నుంచి రక్షణ పొందవచ్చు. తల ఫై జుట్టు లేనివాళ్లు ఈ సన్స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల మీ తల రక్షణ పొందుతుంది. అలాగే జుత్తు ఉన్నవాళ్లు టోపీని ధరించవచ్చు.
2. మీరు మీ చర్మాన్ని సున్నితంగా చూసుకోవాలి:
మీరు మీ చర్మాన్ని వేడి నీటితో
శుభ్రం చేసుకోవాలి.మరీ ఎక్కువ వేడి నీటితో శుభ్రం చేసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ వేడి
ఉన్న మీ చర్మంలో ఉన్న మంచి కణాలు దెబ్బతింటాయి. అందుకనే గోరువెచ్చని నీటితో శరీరాన్ని
శుభ్రం చేసుకోవటం వల్ల మన శరీరంలో ఉన్న మృతు కణాలు తొలగిపోతాయి, అల్లాగే ఇలా గోరువెచ్చని
నీటితో మనం మన శరీరాన్ని శుభ్రం చేసుకోవటం వల్ల ఎటువంటి చర్మ వ్యాధులు మన దరిచేరవు.
3.
మీకు పొడి చర్మం ఉన్నట్లైతే:
ఒకవేళ మీధీ పొడిబారిన చర్మం
ఐతే బయట మార్కెట్లో వివిధ రకములైన మోయిస్తూరిజీస్ (moisturizer ) దొరుకుతాయి. అవి రాసుకోవడం మంచిది.దీని
వల్ల మీ చర్మం తేమగా ఉంటుంది.
4.
హెల్తీ డైట్:
హెల్తీ డైట్ వలన మీరు ఎంతో
అందంగా కనిపించడానికి అలాగే దాన్ని మీరు అనుభూతి చెందడానికి మీకు ఎంతో సహాయపడుతుంది.
హెల్తీ
డైట్ కు కావలిసినవి పండ్లు, కూరగాయలు ,తృణ ధాన్యాలు మరియు ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న
ఆహారాలు తీసుకోవాలిసి ఉంటుంది. ఇలా హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల మీరు యవ్వనంగా కనిపించడానికి
సహాయపడుతుంది.చర్మానికి అతి ముఖ్యమైనది నీరు మనం పుష్కలంగా నీరు తీసుకోవడం వల్ల మన
చర్మం ఎపుడు హైడ్రేట్ అవ్వదు అలాగే మన చర్మం నిగారింపుతో ఉంటుంది.
5.
ఒత్తిడి మరియు నిద్ర:
మీరు నియంత్రించలేని ఒత్తిడి
వలన మీ చర్మం సున్నితంగా మారుతుంది. అలాగే ఎన్నో చర్మ సమస్యలను సృష్టిస్తుంది.ఒత్తిడి
నియంత్రించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. దానిలో
ఒకటి ధ్యానం.మీరు ధ్యానం చేయటం వల్ల మీరు ఎన్నో రకములైన ఒత్తిడిలను నియంత్రించవచ్చు.దాన్ని
వలన మీ చర్మం పునర్జీవనం పొందుతుంది.అలాగే మనిషికి నిద్ర చాలా అవసరం. మనం నిద్రలో ఉండటం
వలన మన చర్మం మోడ్ స్టేజి లో ఉంటుంది.అందుకని కనీసం ప్రతి ఒక్క మనిషి 8 గంటలు నిద్రపోవాలి.
6.
చర్మ సంరక్షణ దినచర్యను నిర్వహించడం:
ఇపుడున్న పరిస్థితుల్లో చాలా
మంది చర్మ సంరక్షణ దినచర్యను పాటించలేకపోతున్నారు.ఎందుకంటే ఉద్యోగాలు నిమిత్తం కంప్యూటర్
లేక లాప్టాప్ వద్ద కూర్చునే ఉంటున్నారు.ఇలా కంప్యూటర్ లేక లాప్టాప్ వద్ద అతుక్కుపోవడం
వల్ల కంటి కింద నల్లటి వలయాలు లేక నల్లటి మచ్చలు కనపడుతున్నాయి.మీరు రోజులో ఒక పది
నిముషాలు మీ చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం కేటాయించండి.మీరు మీ కంటి కింద కీరా ముక్కలు
లేక బెంగాలుదుంప ముక్కలు మీ కంటి పై ఉంచండి.ఇలా చేయడం వల్ల మీ కంటి కింద వలయాలు తగ్గుముఖం
పడతాయి.
7. అరటిపండు ఫేస్ ప్యాక్:
ఈ పేస్ ప్యాక్ చర్మాన్ని
చాలా ప్రభావితం చేస్తుంది.అరటిపండులో మన చర్మానికి కావలిసిన ఎన్నో రకములైన గుణాలు ఉన్నాయి.దీనిలో
విటమిన్ A ,విటమిన్ E పుష్కలంగా ఉన్నాయి.ఈ ఆరడిపండులో ,తేనే,కొన్ని పాలు కలిపి ఈ మిశ్రమాన్ని
చర్మానికి పట్టించడం వల్ల చర్మం మోయిస్తూరిజగా
ఉంటుంది.చర్మం పై 10 నిముషాలు ఉంచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వలన
మన చర్మంలో ఉన్న నల్లటి మచ్చలు ఇంకా మృతు కణాలు తొలగి చర్మం ఏంటో మృదువుగా ఇంకా నిగారింపుగా
తెయారవుతుంది.
8.
జిడ్డు చర్మం:
చాలా మందికి పొడి చర్మం లేక
జిడ్డు చర్మం ఉంటుంది.ఎందుకంటే జిడ్డు చర్మం ఉన్నవాళ్లలో వారి గ్రంధులు ఎక్కువుగా
"సెబమ్" అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడం వలన జిడ్డు చర్మం ఏర్పడుతుంది .దీని
వలన చర్మం పై మొటిమలు లాంటివి ఏర్పడతాయి.వీరికి వేసవి కలం ఇబ్బంది కరంగా తయారవుతుంది.అందుకోసం
వీరి చర్మానికి నిమ్మకాయ చాలా ఉపయోగ పడుతుంది. ఎందుకంటే నిమ్మకాయలో "సిట్రిక్
ఆసిడ్" ఉంటుందని అందరికి తెలిసిన విషయమే దీని చర్మం పై రాసి ఒక 5 నిముషాలు చర్మం
పై ఉంచుకొని తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వలన చర్మంలో జిడ్డు తత్వం తగ్గుతుంది.
10. చలికాలంలో
మనకు దాహం ఎక్కువగా అనిపించకపోవడం:
చలి కాలంలో దాహం వేయకపోవడం
సర్వ సాధారణం.చలి కాలంలో కానీ వేసవి కాలంలో కానీ నీరు తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న
ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది . ప్రతి కాలంలో మనిషి 8 గ్లాసులు నీరు త్రాగాలి.చలి కాలంలో
నీరు ఎక్కువ త్రాగడం వలన మన శరీరం వెచ్చగా ఉండేందుకు సహాయపడుతుంది.చలి కాలంలో పొడి
గాలి వలన మన శరీరం లో శక్తీ తక్కువుగా ఉంటుంది. అందువలన మన చర్మం పొడిబారుతుంది.అందువలన
నీరు ఎక్కువుగా త్రాగడం వలన మన చర్మం హైడ్రేట్ అవకుండా కాపాడుతుంది.అలాగే మన శరీరం
లో ఉన్న టాక్సిన్స్ బయటకు నెట్టి వేస్తుంది.
11.
నలుగు పెట్టండి :
నలుగు అంటే సెనగపిండి,పాలు,నాలుగు
చుక్కలు నిమ్మకాయ రసం, కొంచెం పసుపు కలిపినా మిశ్రమాన్ని నలుగు అంటారు.మీ శరీరానికి
వారానికి ఒక సారి నలుగు పెట్టండి.ఇలా పెట్టడం వలన మీ శరీరంలో ఉన్న మృతు కణాలు తొలగిపోతాయి.అలాగే
ఇలా చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
12.
పసుపు:
పసుపు ఒక శక్తివంతమైన ఆయుర్వేదం.దీని
గురించి శాస్త్ర పరంగా ఇంకా శాస్త్రీయపరంగా దీని యుక్కా ప్రయోజనాలు గురించి వివరించబడ్డాయి.పసుపు
కొత్త కణాలు పెరుగుదలకు సహాయపడుతుంది.ఇది శరీరం పై ముడతలు ఇంకా వృధాప్యని నియంత్రిస్తుంది.పసుపు
లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పసుపులో కొంచం బియ్యపు
పిండి ఇంకా పాలు కలిపి చర్మం పై రాస్తే ముడతలు మరియు నల్లటి మచ్చలు తగ్గుతాయి.
13.
కలబంద:
కలబంద ఇది అందరి ఇంట్లో ఉంటుంది. దీని రెండు విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు.
1) మొదటిది వైద్యం
2) రెండోవది చర్మానికి
1) చెక్కర వ్యాధి ఉన్నవాళ్లు
తెల్లవారుజామున పరకడుపున ఒక స్పూన్ తింటే చెక్కర వ్యాధి నియంత్రణలో ఉంటుంది.అలాగే మరి
కొన్ని వ్యాధులకు చాల ఉపయోగ పడుతుంది.ఒకవేళా ఎవరికైనా ఇది తిన్న తర్వాత శరీరంలో దురదలు
కానీ వస్తున్నాయ్ అంటే దీని వెంటనే మానయవచ్చు.
2)కలబంద కొత్త కణాలను పెరుగుదలకు
ప్రేరేపిస్తుంది.కలబంద చర్మానికి రాయడం వలన చర్మం మెరుస్తుంది .
ఒకవేళ అనుకోకుండా ఎక్కడైనా బర్న్ అయి ఉంటె ఈ కలబంద రాయటం
వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది. కలబంద చర్మాన్ని ధృడంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
14.
టమాటో ప్యూరీ:
ఈ టమాటో ప్యూరీ చాల మంది
ఉపయోగిస్తూఉంటారు. టమాటోలో యాంటీఆక్సిడాంట్స్ ఇంకా విటమిన్ సి ఉంటుంది.ఈ టమాటో ప్యూరీ
వేసుకోవడం వలన చర్మానికి సంబందించిన వ్యాధులు ఉదాహరణకి: కాన్సర్ లాంటివి రాకుండా చేస్తుంది.ఇది
బియ్యపు పిండితో కలిపి రాసి ఒక 25 నిముషాలు చర్మం పై ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
15.
మోయిస్తూరిజ్:
మీరు యవ్వన చర్మాన్ని రుపొంచించుకోవడానికి ఎక్కువ
యాంటీఆక్సిడాంట్స్ గల వాటిని మీరు మీ చర్మానికి రాయాలి. ఇలా రాసిన తర్వాత కొంత సేపటికి
మోయిస్తూరిజ్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తూవుంటే
మీ చర్మం ఎపుడు యవ్వనంగా ఇంకా వృద్దాప్యం త్వరగా రాకుండా కాపాడుకోవచ్చు.
ముగింపు:
నేను పైన చెప్పిన వన్నీ సహజ సిద్దమైన ప్రక్రియలు ప్రయత్నించి చూసి మంచి ఫలితాలను పొందండి.
0 Comments